ముందుకే పద…

సరి సరి పద ముందుకు మరి

సరి సరి వెనకడుగు ఎందుకు మరి

మబ్బులు కదిలి తేనె వర్షం మరి
సూరీడు తిరిగితేనే పగలు మరి
గడియారం ఆగిందని సమయం ఆగనట్లే
నువ్వు ఆగావని ప్రపంచం కూడా ఆగదు

So, my dear మానవా,
పద పద ముందుకు పద మరి…
అలిసే వరకు ఆగక పద…

ఈ పరుగుల వలయం లో ఆగినా ఆట కొనసాగించు మరి..

దారి చూపిస్తావో లేక అనుకరిస్తా వో నీ ఇష్టం ముందుకే పద,
ఓ సారి తడపడితే… మళ్ళీ లేచి పద

ఆగావా..!!
అగాథం లా ఉందా… ఓ సారి చూడు, లోతైనా తెలుస్తుంది,
ఎడారి లా ఉందా… అయినా పద, దాహం విలువైనా తెలుస్తుంది…

సరి సరి పద ముందుకు మరి

సరి సరి వెనకడుగు ఎందుకు మరి

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.